- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మిడతల దండు దాడులు చేస్తాయ్.. జాగ్రత్త’
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మిడతల దండు మహారాష్ట్ర వరకు వచ్చిందని.. ఏక్షణమైనా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అధికారులు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా రైతులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలోని వార్ధాలో ప్రస్తుతం మిడతల దండు కేంద్రీకృతమైందని, ఇవి గంటకు 5 నుంచి […]</p>

X
దిశ, నిజామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మిడతల దండు మహారాష్ట్ర వరకు వచ్చిందని.. ఏక్షణమైనా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అధికారులు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా రైతులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలోని వార్ధాలో ప్రస్తుతం మిడతల దండు కేంద్రీకృతమైందని, ఇవి గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ విజృంభిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కనిపించే మిడతలను ఎడారి మిడతలంటారని, పంటలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తాయని అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






