మరోసారి చిరుత దాడి

by Batti.Sumithra |

<p>దిశ , ఇబ్రాహీంపట్నం: వరుస దాడులకు పాల్పడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత తాజగా శుక్రవారం రాత్రి దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. 20 రోజుల వ్యావధిలోనే రెండుసార్లు దాడి చేయటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి అనే రైతు కుటుంబానికి చెందిన గేదె పై చిరుత పులి దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనలకు [&hellip;]</p>

మరోసారి చిరుత దాడి
X

దిశ , ఇబ్రాహీంపట్నం: వరుస దాడులకు పాల్పడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత తాజగా శుక్రవారం రాత్రి దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది. 20 రోజుల వ్యావధిలోనే రెండుసార్లు దాడి చేయటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి అనే రైతు కుటుంబానికి చెందిన గేదె పై చిరుత పులి దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ హాబిబ్, ఉప సర్పంచ్ కావాలి జగన్.. ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరుస దాడులు జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. సమాచారం ఇచ్చినా రావడం లేదని ఆరోపించారు. ఇక్కడ రైతులు పొలలాకు వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నారన్నారు. కానీ, ఫారెస్ట్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, మా గ్రామ రైతులను ఇప్పటికైనా ఆదుకోవాలన్నారు.

Next Story