మాన్సాస్‌ ట్రస్ట్‌లో ఆడిటింగ్.. 16ఏళ్ల తర్వాత తొలిసారి

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-07-05 06:49:03  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలపై 16ఏళ్ల తర్వాత ఆడిట్‌ నిర్వహణ సర్వత్రా ఆసక్తి రేపుతుంది. జిల్లా ఆడిట్‌ అధికారి హిమబిందు ఆధ్వర్యంలో విజయనగరంలోని కోటలో ఉన్న ట్రస్ట్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆడిట్‌ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆడిటింగ్‌ అధికారి డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ 2004 నుండి మాన్సాస్ ట్రస్ట్‌ ఆడిటింగ్‌ జరగలేదన్నారు. తాము ప్రతి ఏడాది ఆడిటింగ్‌ చేస్తాం అని నోటీసులు ఇస్తున్నాం కానీ జరగడం [&hellip;]</p>

ap news
X

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలపై 16ఏళ్ల తర్వాత ఆడిట్‌ నిర్వహణ సర్వత్రా ఆసక్తి రేపుతుంది. జిల్లా ఆడిట్‌ అధికారి హిమబిందు ఆధ్వర్యంలో విజయనగరంలోని కోటలో ఉన్న ట్రస్ట్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆడిట్‌ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆడిటింగ్‌ అధికారి డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ 2004 నుండి మాన్సాస్ ట్రస్ట్‌ ఆడిటింగ్‌ జరగలేదన్నారు. తాము ప్రతి ఏడాది ఆడిటింగ్‌ చేస్తాం అని నోటీసులు ఇస్తున్నాం కానీ జరగడం లేదన్నారు. ఇప్పుడు వేగంగా ఆడిటింగ్‌ చేయాలి అని దేవాదాయ శాఖ నుండి ఆదేశాలు రావడంతో చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి దేవాలయాలకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి పత్రాలు ఇంకా అందజేయలేదన్నారు. తమకు ఏమేమి రికార్డులు కావాలి అనే అంశాలతో కూడిన నోటీసులు మాన్సాస్ ట్రస్ట్ మేనేజ్మెంట్‌కు అందజేసినట్లు హిమబిందు తెలిపారు. అలాగే తమకు వచ్చిన రికార్డులను బట్టి ఆడిటింగ్‌ చేయడానికి ఎంతమంది సిబ్బంది అవసరమో ఆ మేరకు నిర్ణయిస్తామన్నారు.

ప్రతి ఏడాది ఆడిటింగ్‌ చేయడం కోసం ఫీజ్‌ కట్టాం అని మాన్సస్‌ ట్రస్ట్‌ చెపుతున్న నేపథ్యంలో అసలు కట్టారో లేదో రికార్డులు చూసి మాత్రమే చెప్పగలమన్నారు. ఆడిటింగ్‌ ఫీజ్‌ అనేది తాము ఆడిటింగ్ చేసిన తర్వాత మాత్రమే నిర్ణయిస్తామని ముందే ఎలా కడతారని ప్రశ్నించారు. ఈ ఆడిటింగ్‌ లో సంయుక్త ఆడిటింగ్‌ అధికారి తిరుపతి నాయుడు పాల్గొన్నారు.

Next Story