5జీ సేవలందించేందుకు తక్కువ ధరలో స్పెక్ట్రమ్ అవసరం!

by  |
voda-idea
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టెలికాం పరిశ్రమ దీర్ఘకాలంలో నిలకడగా కొనసాగేందుకు సరసరమైన ధరలకు తగిన స్పెక్ట్రమ్‌లను అందించాల్సిన అవసరం ఉందని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ టక్కర్ అన్నారు. టెలికాం నియంత్రణ సంస్థ అంచనాల ప్రకారం.. 5జీ సేవలను అమలు చేసేందుకు రూ. 4.5 – 5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అవసరం. కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికల కోసం తగిన స్థాయిలో తక్కువ స్పెక్ట్రమ్, సులభ చెల్లింపుల నిబంధనలు అవసరమని రవీందర్ టక్కర్ వివరించారు. టెలికాం స్పెక్ట్రమ్‌లను పొందేందుకు సులభ చెల్లింపుల నిబంధనలతో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న పన్నులు, సుంకాలు, వివిధ సవాళ్లతో కూడిన కంపెనీల భారాన్ని తగ్గించాలని రవీందర్ అన్నారు.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన రవీందర్ టక్కర్.. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంస్కరణలు టెలికాం పరిశ్రమపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని పరిష్కరించే దిశగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో పరిశ్రమ నిలకడగా కొనసాగేందుకు మరిన్ని చర్యలు అవసరం. దానివల్ల వృద్ధి వేగవంతంగా ఉంటుంది. ఇప్పటికే పరిశ్రమ దిగ్గజాలు స్పెక్ట్రమ్‌ను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. అలగే, పన్నులు, సుంకాలను హేతుబద్దీకరించాలని తెలిపారు. ఈ సమస్యలు పరిష్కరించిబడిన తర్వాతే వినియోగదారు సగటు ఆదాయాన్ని మెరుగుపరుస్తుందన్నారు. గత నెలలో అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ధరలను 18-25 శాతం పెంచాయి. ఇది కొంత సానుకూలమని భావిస్తున్నట్టు రవీందర్ వెల్లడించారు.


Next Story