జూన్ 30న అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికలు

by  |
జూన్ 30న అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్‌కు ఈ నెల 30వ తేదీన ఆన్‌లైన్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,444 మంది అడ్వొకేట్లు సభ్యులుగా ఉన్న ఈ అసోసియేషన్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా కూడా విడుదలైంది. ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, రెండు సెక్రటరీ, ఒక జాయింట్ సెక్రటరీ పోస్టులతో పాటు మొత్తం 15 పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు పోస్టులు మహిళలు రిజర్వుగా ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు శుక్రవారం నుంచి సోమవారం వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మరుసటి రోజున నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. పోలింగ్ ఈ నెల 30వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగిన తర్వాత ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలు వెలువడనున్నాయి.


Next Story

Most Viewed