‘మేజర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by  |
‘మేజర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: శశికిరణ్ తిక్క డైరెక్షన్‌లో అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’.. కాగా ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ న్యూస్ తెలిపిన మేకర్స్.. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను, న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే 2022 ఫిబ్రవరి 11 న ‘మేజర్’ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఇక మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోని పిక్చర్స్ ఫిల్మ్స్ మీడియా, GMB ఎంటర్ టైన్మెంట్, A+S మూవీస్ కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Next Story

Most Viewed