‘ఓమ్’.. మై నెక్స్ట్ జర్నీ :ఆదిత్య

by  |
‘ఓమ్’.. మై నెక్స్ట్ జర్నీ :ఆదిత్య
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్.. తన బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాడు. సెలెబ్రిటీలు, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ తనకు బెస్ట్ విషెస్ అందిస్తుండగా.. పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘మలంగ్, లూడో’ సినిమాలతో ఈ ఏడాది సూపర్ హిట్స్ అందుకున్న బర్త్ డే బాయ్.. ‘ఓమ్ – ది బ్యాటిల్ విత్ ఇన్’ సినిమా ద్వారా స్క్రీన్స్‌పై ఫైర్ సెట్ చేయబోతున్నాడు. ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ స్క్రిప్ట్‌పై లాక్‌డౌన్‌లో పూర్తిగా వర్క్ చేశామని.. త్వరలో ‘ఓమ్’ జర్నీ స్టార్ట్ చేయబోతున్నామని తెలిపాడు. అంతేకాదు ఈ ఏడాది రెండు హిట్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆదిత్య.. 2020 తనకు స్పెషల్ అని చెప్పాడు.

ఎమోషనల్లీ డిస్టర్బింగ్ రిలేషన్‌షిప్స్ చుట్టూ ‘ఓమ్’ కథ డిజైన్ చేయగా.. ఆదిత్యకు ఫస్ట్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ఇదే కానుంది. కపిల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్న సినిమాకు అహ్మద్ ఖాన్ నిర్మాత. డిసెంబర్ చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న చిత్రంలో సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలుస్తుండగా.. దర్శక, నిర్మాతలు 2021 సెకండ్ హాఫ్‌లో సినిమా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారని టాక్.

Next Story

Most Viewed