- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటుకున్న టీజీవో అధ్యక్షుడు
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గెజిటెడ్ అధికారుల సంఘం నేత అజ్మీరా శ్యాం నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామనికి చెందిన తల్లి కొడుకులు ఇద్దరు కలిసి సోమవారం బైక్ పై ఇంద్రవెల్లి మండలం దేవపూర్ గ్రామానికి వెళుతుండగా మార్గ మద్యంలో గండి రాంపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. స్పీడ్ బ్రేకర్ ను చూసుకోలేక రోడ్డు ప్రమాదానికి గురి కాగా… ఖానాపూర్ నుండి ఇంద్రవెల్లి మండలంలోని శుభకార్యానికి వెళుతున్న టీజీవో ఉమ్మడి […]</p>

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గెజిటెడ్ అధికారుల సంఘం నేత అజ్మీరా శ్యాం నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామనికి చెందిన తల్లి కొడుకులు ఇద్దరు కలిసి సోమవారం బైక్ పై ఇంద్రవెల్లి మండలం దేవపూర్ గ్రామానికి వెళుతుండగా మార్గ మద్యంలో గండి రాంపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. స్పీడ్ బ్రేకర్ ను చూసుకోలేక రోడ్డు ప్రమాదానికి గురి కాగా… ఖానాపూర్ నుండి ఇంద్రవెల్లి మండలంలోని శుభకార్యానికి వెళుతున్న టీజీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్ వారిని గమనించారు. వెంటనే ఆయన సొంత వాహనంలో ఎక్కించుకొని ఉట్నూర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకొచ్చి డాక్టర్లతో చికిత్స లు చేయించారు. తల్లి అనితకు తీవ్ర గాయాలై చెవిలో నుంచి రక్త స్రావం కావడంతో సొంత ఖర్చులతో అంబులెన్స్ మాట్లాడి ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.






