- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు.. ఆమెతో రిలేషన్ విషపూరితం
<p>దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ అధ్యాయన్ సుమన్.. కంగనా రనౌత్‌తో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పాడు. తనతో రిలేషన్ విషపూరితమైనదని, దాని వల్ల జీవితంలో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్నాని చెప్పాడు. 2008-09 మధ్య కొన్నినెలల పాటు రిలేషన్‌లో ఉన్న వీరు.. ‘రాజ్’ సినిమాలో కలిసి నటించారు. ఓల్డ్ ఇంటర్వ్యూలో తమ రిలేషన్‌పై కంగనా పేరు మెన్షన్ చేయకుండా స్పందించిన అధ్యాయన్.. ఇదే క్రమంలో తనను ఫ్లాప్ యాక్టర్‌గా ఎలా మిగిలిపోయాడో చెప్పుకొచ్చాడు. ఎమోషనల్‌గా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ అధ్యాయన్ సుమన్.. కంగనా రనౌత్‌తో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పాడు. తనతో రిలేషన్ విషపూరితమైనదని, దాని వల్ల జీవితంలో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్నాని చెప్పాడు. 2008-09 మధ్య కొన్నినెలల పాటు రిలేషన్‌లో ఉన్న వీరు.. ‘రాజ్’ సినిమాలో కలిసి నటించారు. ఓల్డ్ ఇంటర్వ్యూలో తమ రిలేషన్‌పై కంగనా పేరు మెన్షన్ చేయకుండా స్పందించిన అధ్యాయన్.. ఇదే క్రమంలో తనను ఫ్లాప్ యాక్టర్‌గా ఎలా మిగిలిపోయాడో చెప్పుకొచ్చాడు. ఎమోషనల్‌గా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో చాలా జరిగాయని, ఆ పరిస్థితుల నుంచి బయటపడటం చాలా కష్టమైందని తెలిపాడు. ఆ టైమ్‌లో తన తండ్రి శేఖర్ సుమన్ చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చాయని, జీవితంలో ముందుకు సాగేందుకు తోడ్పడ్డాయని చెప్పాడు. ఇదిలా ఉంటే, అధ్యాయన్ తన పాత ఇంటర్వ్యూలో కంగనా డ్రగ్స్ తీసుకుంటుందని ఆరోపించడం పట్ల వార్తల్లో నిలిచాడు. అయితే దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన రాజ్ యాక్టర్.. తన పాత జీవితం నుంచి దూరంగా ఉంటున్నాని, నన్ను ఇలాగే ఉండనివ్వండని పేర్కొనడం విశేషం.






