డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న ‘దిశ’

84

దిశ, క్రైమ్ బ్యూరో : సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ డిజిటల్ రంగంలో దిశ పత్రిక దూసుకెళ్తోందని తెలంగాణ పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌ అన్నారు. దిశ పత్రిక క్యాలెండర్‌ 2021ను వారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మీడియా రంగంలో ‘దిశ’ ప్రారంభమైన కొద్ది రోజులకే మంచి పేరు సంపాదించుకోవడం అభినందనీయమన్నారు. సమాజంలోని అనేక పరిణామాల్లో వాస్తవాల వైపు పయనిస్తూ పత్రికలు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాంటి వాస్తవిక దృష్టితో సమాజాన్ని మేల్కోలిపేలా దిశ పత్రిక పయనిస్తుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..