బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆదాశర్మ

by  |
బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆదాశర్మ
X

దిశ, సినిమా : హీరోయిన్ ఆదా శర్మ ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ చేయబోతోంది. ప్రసాద్ కదం దర్శకత్వంలో వస్తున్న ఈ చిన్న సినిమాకు ‘చూహా బిల్లి’ టైటిల్ ఫైనల్ చేయగా.. పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘చూహా బిల్లి’ డార్క్ సబ్జెక్ట్ కాగా.. ఇందులో ఆదా శర్మ బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్‌తో బాధపడుతున్న యువతిగా కనిపించబోతోంది. ఈ పాత్ర గురించి మాట్లాడిన హీరోయిన్.. సినిమాలో క్యారెక్టర్‌కు తను టోటల్ ఆపోజిట్‌గా ఉంటానని తెలిపింది. అందుకే ఈ రోల్ ప్లే చేసేందుకు అట్రాక్ట్ అయ్యానని చెప్పింది. ఇందుకోసం వర్క్ షాప్స్ కూడా అటెండ్ అయ్యానన్న భామ.. సెకన్స్‌లో మూడ్ చేంజ్ చేయాలని డైరెక్టర్ కోరాడని తెలిపింది.

అప్పుడే ఎగ్జైట్ కావడం.. అంతలోనే బాధగా కనిపించడం.. కళ్లలోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపించాలని.. ప్రతీది పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకున్నాడని చెప్పింది. ఇంత వరకు చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫిబ్రవరి 12న యూట్యూబ్‌లో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపింది ఆదా. అనుప్రియ గోయెంకా మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు మొహమ్మద్ మునీమ్ సంగీతం అందించగా, ఎఫ్ఎన్‌పీ మీడియా సమర్పణలో క్రిస్టల్ మైండ్స్ ప్రొడక్షన్ నిర్మించింది.



Next Story

Most Viewed