ఆ రోడ్డులో నటిని వెంబడించిన యువకులు.. ఏం చేశారో తెలుసా?

by  |
nikitha dutta
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ నటి నిఖితా దత్తాకు తాజాగా ఊహించని సంఘటన ఎదురైంది. ఇటీవల ముంబైలోని బాంద్రా రోడ్డులో ఫ్రెండ్స్‌తో సరదాగా తిరుగుతుండగా.. బైకు‌పై వచ్చిన ఇద్దరు అపరిచిత యువకులు తన మీద దాడిచేసినట్లు తెలిపింది. ఈ ఇన్సిడెంట్ గురించి ఇన్‌స్టా వేదికగా నిఖితా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తన మీద దాడిచేసిన వ్యక్తులు సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్‌ను బలవంతంగా లాక్కొని వేగంగా వెళ్లిపోయారని చెప్పిన నటి.. కాసేపు ఏం జరుగుతోందో అర్థం కాలేదని, అంతా అయోమయంగా అనిపించిందని తెలిపింది. తేరుకున్న తర్వాత గట్టిగా అరిచానని, చుట్టుపక్కల వ్యక్తులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొంది. దీంతో బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వివరించింది. కాగా ‘లేకర్ హమ్ దీవానా దిల్’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిఖిత.. చివరగా ఇమ్రాన్ హష్మీ ‘డైబ్బక్‌’ సినిమాలో కనిపించింది.

విడాకుల తర్వాత సమంతను వెనకుండి నడిపిస్తున్న తల్లి

Next Story

Most Viewed