‘మా’ ఎన్నికలో భలే ట్విస్ట్.. తప్పుకున్న జీవిత, హేమ.. ఏం జరిగింది.?

by  |
‘మా’ ఎన్నికలో భలే ట్విస్ట్.. తప్పుకున్న జీవిత, హేమ.. ఏం జరిగింది.?
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్యూహ్యరీతిలో జీవితా రాజశేఖర్, హేమ ఎన్నికల పోటీ నుంచి వైదొలిగారు. అంతే కాకుండా అందరినీ షాక్‌కు గురి చేస్తూ ఆశ్చర్యకరంగా వాళ్లిద్దరూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేరారు.

ఈ క్రమంలో ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా ఉన్న ప్రకాశ్ రాజ్ శుక్రవారం తన ప్యానెల్‌ను ప్రకటించారు. ఇందులో హేమ ఉపాధ్యక్షురాలిగా పోటీపడుతుండగా, జీవితా రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్నట్టు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. తాను హేమతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితి వివరించానని, ఆమె పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని తెలిపారు. హేమ ఎంతో డేరింగ్ ఉన్న మహిళ అని, అందుకే ఆమెకు ప్యానెల్లో చోటు కల్పించామని చెప్పారు.

ఇక జీవితతో రెండున్నర గంటలు చర్చించి.. ‘మా’ కోసం తాను రూపొందించుకున్న ప్రణాళికను వివరించానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె సానుకూలంగా స్పందించి, బరి నుంచి తప్పుకున్నారని తెలిపారు. అంతేకాకుండా, తమ ప్యానెల్లో పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తపరిచినట్టు ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed