‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్.. అదేం పని?

by  |
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్.. అదేం పని?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ అర్జున్ రెడ్డి(ఆదిత్య వర్మ) హీరోయిన్ ‘బానిట సంధు’కు కరోనా పాజిటివ్. కోల్‌కతాలో ‘కవిత అండ్ థెరిసా’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న భామ, కొవిడ్ పాజిటివ్‌తో సోమవారం ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్‌లో సరైన సౌకర్యాలు లేవని, అక్కడ ట్రీట్‌మెంట్ నిరాకరించిన సంధు.. డిసెంబర్ 20న సిటీకి చేరుకుంది. అయితే కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ వచ్చిన యూత్‌తో ఫ్లైట్ జర్నీ చేసిన తను కూడా న్యూ స్ట్రెయిన్‌తో ఇన్‌ఫెక్ట్ అయిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా బ్రిటిష్ యాక్ట్రెస్ అయిన సంధు.. హిందీ, తమిళ్ సినిమాల్లో నటించింది. ఇటీవల యూకే నుంచి వచ్చిన వారికి ట్రీట్‌మెంట్ అందించేందుకు ‘ది బెలియాఘాట ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్’ సపరేట్ యూనిట్‌ ఏర్పాటు చేయగా.. అందులో ట్రీట్‌మెంట్ తీసుకోనంటూ సంధు ప్రోటోకాల్‌కు వ్యతిరేకంగా బిహేవ్ చేసిందని, దీంతో బ్రిటిష్ హైకమిషన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు.

Next Story