అభిమాన సంఘాల నేతలతో నటుడు విజయ్ భేటీ

by Shamantha N |

<p>దిశ, వెబ్‎డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో నటుడు తలపతి విజయ్ అభిమాన సంఘాల నేతలతో కీలక భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని మధురై, దిండిగల్‌, తిరునల్వేలితో సహా పలు జిల్లాల్లో అధ్యక్షులతో సమావేశమయ్యారు. మరో వారం రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విజయ్‌.. మక్కల్ ఇయక్కమ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మక్కల్‌ ఇయక్కమ్‌నే రాజకీయ [&hellip;]</p>

అభిమాన సంఘాల నేతలతో నటుడు విజయ్ భేటీ
X

దిశ, వెబ్‎డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో నటుడు తలపతి విజయ్ అభిమాన సంఘాల నేతలతో కీలక భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని మధురై, దిండిగల్‌, తిరునల్వేలితో సహా పలు జిల్లాల్లో అధ్యక్షులతో సమావేశమయ్యారు. మరో వారం రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విజయ్‌.. మక్కల్ ఇయక్కమ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మక్కల్‌ ఇయక్కమ్‌నే రాజకీయ పార్టీగా మార్చే యోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారా..? లేదా ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది.

Next Story