- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vidyut Jammwal: వరల్డ్ టాప్ 10 మార్షియల్ ఆర్టిస్ట్స్‌లో ఆ హీరో.!
<p>దిశ, సినిమా : హీరో విద్యుత్ జమ్వాల్ నటుడిగా మాత్రమే కాకుండా మార్షియల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తన మూడవ ఏట నుంచే ‘కలరిపయట్టు’ నేర్చుకున్న ఆయన.. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ టెన్ మార్షియల్ ఆర్ట్స్ ట్రైనర్స్‌లో ఒకరిగా నిలిచాడు. ‘టాప్ మార్షియల్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’ అని గూగుల్‌లో సర్చ్ చేయగా వచ్చిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన జమ్వాల్.. జాకీ చాన్, జెట్ లీ, బ్రూస్ లీ, స్టీవెన్ సీగల్, […]</p>

దిశ, సినిమా : హీరో విద్యుత్ జమ్వాల్ నటుడిగా మాత్రమే కాకుండా మార్షియల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తన మూడవ ఏట నుంచే ‘కలరిపయట్టు’ నేర్చుకున్న ఆయన.. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ టెన్ మార్షియల్ ఆర్ట్స్ ట్రైనర్స్‌లో ఒకరిగా నిలిచాడు. ‘టాప్ మార్షియల్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’ అని గూగుల్‌లో సర్చ్ చేయగా వచ్చిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన జమ్వాల్.. జాకీ చాన్, జెట్ లీ, బ్రూస్ లీ, స్టీవెన్ సీగల్, డోన్నీ యెన్, టోనీ జా లాంటి ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్స్ సరసన తను కూడా చేరడంపై సంతోషంగా ఉందన్నాడు.
ఈ పోస్ట్‌పై స్పందించిన తన ‘కమాండో’ కోస్టార్ హీరోయిన్ ఆదా శర్మ.. ‘కమాండో ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాడు’ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఎల్లప్పుడూ ఇండియాను గర్వపడేలా చేస్తున్న జమ్వాల్‌ను చూస్తుంటే ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నామని తెలిపారు.






