- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు సోనుసూద్ సడన్ ఎంట్రీ
<p>దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్నారు బాలీవుడ్ నటుడు సోనుసూద్. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆయన ఎంతో మందికి అండగా నిలిచారు. ఇటీవల సోనుసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కూడా కట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోనుసూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టుకున్నాడు. సోనుసూద్ పేరు పెట్టడంతో తనకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్నారు బాలీవుడ్ నటుడు సోనుసూద్. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆయన ఎంతో మందికి అండగా నిలిచారు. ఇటీవల సోనుసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కూడా కట్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోనుసూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టుకున్నాడు. సోనుసూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. శుక్రవారం ఆ పాస్ట్‌ఫుడ్ సెంటర్ ను సోనూసూద్ సడన్ గా విజిట్ చేశారు. వంటకాలను పరిశీలించారు. తాను ఫ్రైడ్ రైస్‌ను ఆరగించారు. రుచి అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. కాసేపు స్థానికులతో మాట్లాడారు. సోనుసూద్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
Next Story






