మగవాళ్లు కూడా ముండమోపుల్లా ఏడుస్తున్నారు.. నరేష్ వివాస్పద వ్యాఖ్యలు

by  |

దిశ, వెబ్‌డెస్క్: మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది కానీ తగ్గడంలేదు. ఎలక్షన్స్ అప్పుడు మాటల యుద్ధంతో రణరంగంగా మారిన ఇరు ప్యానెల్స్.. ఎలక్షన్స్ తర్వాత కూడా రణరంగాన్నే తలపిస్తోంది. ఇరు పక్షాల మెంబర్స్ ఒకరిపై ఒకరు ఘాటు ఆరోపణలు చేస్తూ రచ్చలేపుతున్నారు. నిన్నటికి నిన్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ అయిన బెనర్జీ, ఉత్తేజ్ లు మోహన్ బాబు రౌడీయిజం చేశారని, తమను కొట్టడానికి వచ్చారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇక తాజాగా వారు చేసిన వ్యాఖ్యలపై విష్ణు ప్యానెల్ మెంబర్ నరేష్ స్పందించారు. మంచు విష్ణును ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదని, ఆయనను ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని హెచ్చరించారు. అంతేకాకుండా ఏడుస్తూ ఆరోపణలు చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎలక్షన్స్ అయిపోయి, గెలిచాక కూడా ఏంటీ రచ్చ.. గెలిచినవాళ్లు రాజీనామా చేస్తే వారి సంగతి కొత్త కమిటీ చూసుకొంటుందని తెలిపారు. ఓడినా, గెలిచినా ఒకే దగ్గర పనిచేస్తామని చెప్పి, ఇప్పుడెందుకు ఇంతలా మా మీద నిప్పులు చెరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచినా, ఓడినా మా ఎప్పుడు ఒక్కటే అన్న ఆయన మా అనేది అందరి కుటుంబమని.. గెస్ట్ గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారని మండిపడ్డారు. మీడియా ముందు మగవాళ్లు కూడా ముండమోపుల్లా ఏడుస్తున్నారని, అంతగా ఏడ్చేవాళ్లు ఎందుకు రిజైన్ చేసి వెళ్లారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏమైనా అడగాలి అనుకొంటే ఇక్కడ ఉండి అడగాలి కానీ బయటికి వెళ్లి ప్రశ్నించడం ఏంటని అన్నారు. మోడీ గెలిచాడు అని… కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్లారా..? లేదు కదా..? అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నరేష్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Next Story

Most Viewed