- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాపై ప్రధాని మోదీ సంకేతాలు
<p>న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు, పరిస్థితులను ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో పర్యవేక్షించాలని ప్రధాని మోడీ సూచించారు. కొవిడ్ 19తో బాధపడుతున్న రాష్ట్రాలకు సూచనలు చేస్తుండాలని, పాజిటివిటి రేటు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, డాక్టర్ హర్షవర్ధన్, నిటి అయోగ్, సభ్యులు, క్యాబినెట్ కార్యదర్శి సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ […]</p>

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు, పరిస్థితులను ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో పర్యవేక్షించాలని ప్రధాని మోడీ సూచించారు. కొవిడ్ 19తో బాధపడుతున్న రాష్ట్రాలకు సూచనలు చేస్తుండాలని, పాజిటివిటి రేటు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, డాక్టర్ హర్షవర్ధన్, నిటి అయోగ్, సభ్యులు, క్యాబినెట్ కార్యదర్శి సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఢిల్లీలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను మోదీ ప్రశంసించారు. ఇటువంటి విధానాన్నే నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోనూ తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల వివరాలను తెలుసుకున్న తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని తెలిపారు. బహిరంగ ప్రాంతాల్లో క్రమశిక్షణగా మెదులుకోవాలని చెప్పారు. కొవిడ్ 19పై కొత్త పద్ధతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, నివారణ చర్యలపైనా అవగాహన కల్పించాలన్న సంకేతాలను ప్రధాని చేశారు. వ్యక్తిగత నిర్లక్ష్యం తగదని అన్నారు. అహ్మదాబాద్‌లో అమలవుతున్న వ్యూహంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇంటిదగ్గరే కరోనా పేషెంట్లకు ధన్వంత్రి రథ్ కింద చికిత్సనివ్వడం, నిఘా వ్యూహంపై సానుకూల స్పందనలు వచ్చాయి. ఈ విధానాన్నే అవసరమున్న ఇరత రాష్ట్రాల్లోనూ అనుసరించే విషయమై చర్చించినట్టు తెలిసింది.






