ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ: ఏసీపీ నరేష్ కుమార్

by  |
ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ: ఏసీపీ నరేష్ కుమార్
X

దిశ, గీసుగొండ: ప్రజలు పోలీసులకు సహకరిస్తేనే నేరాలు అదుపులోకి వస్తాయని మామునూరు ఏసీపీ నరేష్ కుమార్ అన్నారు. గురువారం ఆయన గీసుకొండ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ రకాల రికార్డులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ నెల లోపు మండలంలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని వాటి వలన గ్రామాలలో జరిగే నేరాలను నియంత్రించవచ్చని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సైలు దేవేందర్, పర్వీన్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


Next Story