- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన మహిళపై యాసిడ్ దాడి
<p>దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుడిలో పూజ చేసుకుంటున్న మహిళపై దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాల్లోకి వెళితే… అల్లూరు మండలం గాలిదిబ్బలోని గంగాలమ్మ ఆలయం వద్ద గిరిజన మహిళ(32) పదిరోజులుగా పూజలు చేస్తోంది. కాగా ఆమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. చికిత్స నిమిత్తం ఆమెను నెల్లూరు జిల్లా జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. బాధితురాలి స్వగ్రామం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుడిలో పూజ చేసుకుంటున్న మహిళపై దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాల్లోకి వెళితే… అల్లూరు మండలం గాలిదిబ్బలోని గంగాలమ్మ ఆలయం వద్ద గిరిజన మహిళ(32) పదిరోజులుగా పూజలు చేస్తోంది. కాగా ఆమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. చికిత్స నిమిత్తం ఆమెను నెల్లూరు జిల్లా జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. బాధితురాలి స్వగ్రామం కొడవలూరు మండలం ఈగతోపుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






