సెట్స్ మీదకు ‘ఆచార్య’

by  |
సెట్స్ మీదకు ‘ఆచార్య’
X

దిశ, వెబ్‌డెస్క్ :
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఈ నెల 9 నుంచి స్టార్ట్ కానున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. లాక్‌డౌన్ తర్వాత సెట్స్ మీదకు వెళ్తుండటం సంతోషంగా ఉందని, నెల రోజుల షెడ్యూల్‌లో మూవీ మేజర్ పోర్షన్ కంప్లీట్ చేస్తామన్న మేకర్స్.. ఈ మెగా మాస్ ఎంటర్‌టైనర్ సమ్మర్ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని తెలిపారు.

కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా కీ రోల్ ప్లే చేయబోతుండగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ రాగా, కొందరు రచయితలు ఈ కథ తమదేనని ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కానీ మోషన్ పోస్టర్ చూసి కథ నాదే అని చెప్పడం కరెక్ట్ కాదని.. దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ నేపథ్యంలో వస్తున్న ఆచార్య కథ కొరటాల శివ ఒరిజినల్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చింది.

Next Story

Most Viewed