- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆచార్య’ నా కథే అంటున్న రచయిత
by Shyam |
<p>మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు బర్త్ డే రోజు విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్.. రిలీజైన కొద్ది క్షణాల్లోనే ట్రెండ్ అవగా, అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ, కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్ర కథ తనదే అంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఆరోపించడం గమనార్హం. 2006లోనే రైటర్స్ అసోసియేషన్‌లో తను ‘పుణ్యభూమి’ టైటిల్‌తో […]</p>

X
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు బర్త్ డే రోజు విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్.. రిలీజైన కొద్ది క్షణాల్లోనే ట్రెండ్ అవగా, అభిమానులు పండగ చేసుకున్నారు.
కానీ, కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్ర కథ తనదే అంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఆరోపించడం గమనార్హం. 2006లోనే రైటర్స్ అసోసియేషన్‌లో తను ‘పుణ్యభూమి’ టైటిల్‌తో రిజిస్టర్ చేయించినట్లు అనిల్ కృష్ణ చెప్పాడు. దీనిపై ‘ఆచార్య’ టీమ్ స్పందించాల్సి ఉండగా.. కేవలం పేరు కోసమే ఇలాంటి పనులు చేస్తున్నాడని రచయితపై మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్.
కాగా, ఈ చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్ని ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోంది. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
Next Story






