- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఆచార్య ' కు కాజల్ గుడ్ బై
<p>మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఆచార్య చిత్రానికి హీరోయిన్లు హ్యాండ్ ఇస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో చిరు సరసన స్మైలింగ్ క్వీన్ త్రిషను ఎంపిక చేయగా… సృజనాత్మక విషయాల్లో బేధాలు అంటూ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా వెల్లడించింది. కానీ మణిరత్నం సినిమాకు డేట్లు సర్దుబాటు చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. ఆ విషయం పక్కన పెడితే త్రిష స్థానంలో కలువ […]</p>

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఆచార్య చిత్రానికి హీరోయిన్లు హ్యాండ్ ఇస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో చిరు సరసన స్మైలింగ్ క్వీన్ త్రిషను ఎంపిక చేయగా… సృజనాత్మక విషయాల్లో బేధాలు అంటూ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా వెల్లడించింది. కానీ మణిరత్నం సినిమాకు డేట్లు సర్దుబాటు చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఆ విషయం పక్కన పెడితే త్రిష స్థానంలో కలువ కళ్లసుందరి కాజల్ ను ఒకే చేశారు కొరటాల. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. కానీ… లాక్ డౌన్ సమయం కారణంగా కాజల్ ఈ సినిమాకు ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. జూలై నుంచి తమిళ్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట. ఆ సమయంలోనే ఆచార్య షూటింగ్ కూడా ఉండనుంది. దీంతో కాజల్ కూడా ఆచార్య కు గుడ్ బై చెప్పినట్లే అని తెలుస్తోంది.
మరి త్రిష పోతే కాజల్ వచ్చినట్లు… కాజల్ ప్లేస్ లో ఎవరు వస్తారో చూడాలి.
Tags : Acharya, Chiranjeevi, Koratala shiva, Kajal Agarwal, Trisha, Tollywood






