- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యన్న హత్యకు కుట్ర.. నిందితుడి అరెస్టు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు మెసేజ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అయ్యన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నర్సిపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి వియ్యపుతాతారావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం 419, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాతారావు స్వస్థలం బుచ్చయ్య పేట మండలం కేపీ అగ్రహారంగా గుర్తించారు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు మెసేజ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అయ్యన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నర్సిపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి వియ్యపుతాతారావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం 419, 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాతారావు స్వస్థలం బుచ్చయ్య పేట మండలం కేపీ అగ్రహారంగా గుర్తించారు.
కాగా, మాజీ మంత్రి హత్యకు కొద్దిమంది కలిసి కుట్ర చేశారని, దానిని మావోయిస్టులు చేసినట్లు చిత్రీకరిస్తారంటూ దుండగుడు అయ్యన్నకు మెసేజ్ పెట్టాడు. అందుకు పలు లావాదేవీలు జరిగాయని, ఆధారాలు తన వద్దనున్నాయని నిందితుడు తనను ఎస్సైగా పేర్కొంటూ అయ్యన్నకు బెదిరింపు మెసేజ్ పంపాడు. మాజీ మంత్రి ఫిర్యాదుతో అతి తక్కువ సమయంలోనే పోలీసులు నిందితుని ఆచూకీ కనిపెట్టి కటకటాల వెనక్కి నెట్టారు.






