ఫ్లాష్.. ఫ్లాష్.. జవాన్‌ డెడ్‌బాడీని తరలిస్తున్న అంబులెన్స్‌కు యాక్సిడెంట్

by  |
ఫ్లాష్.. ఫ్లాష్.. జవాన్‌ డెడ్‌బాడీని తరలిస్తున్న అంబులెన్స్‌కు యాక్సిడెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదాన్ని యావత్ భారత దేశం మరవక ముందే మరో ఘటన కలకలం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఓ జవాన్ మృతదేహాన్ని గురువారం తరలిస్తుండగా సదరు అంబులెన్స్‌కు యాక్సిడెంట్ అయింది. మెట్టుపాలెం నుంచి డెడ్ బాడీని తీసుకొస్తుండగా రోడ్డుకు పక్కన ఉన్న గోడను అంబులెన్స్ అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story