- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో, ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి మరొకరికి..
<p>దిశ, పాపన్నపేట: ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయిన సంఘటన మండల పరిధిలోని కుర్తివాడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. టేక్మాల్ మండల పరిధిలోని అర్చన పల్లి గ్రామానికి చెందిన టీఎస్ 35t 96 81 ఈ నెంబర్ గల ఆటో పాపన్నపేట నుండి మెదక్ వైపు వెళ్తోంది. అదే సమయంలో కుర్తివాడ గ్రామ శివారులో వెనుక నుండి వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో […]</p>

దిశ, పాపన్నపేట: ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయిన సంఘటన మండల పరిధిలోని కుర్తివాడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. టేక్మాల్ మండల పరిధిలోని అర్చన పల్లి గ్రామానికి చెందిన టీఎస్ 35t 96 81 ఈ నెంబర్ గల ఆటో పాపన్నపేట నుండి మెదక్ వైపు వెళ్తోంది. అదే సమయంలో కుర్తివాడ గ్రామ శివారులో వెనుక నుండి వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీ కొట్టింది.
దీంతో ఆటో బోల్తాపడగా ఆటోలో ప్రయాణిస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన మరియమ్మ తీవ్ర గాయాల పాలైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మిన్‌పూర్ గ్రామానికి చెందిన సరోజకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మరియమ్మ తమ కూతురు వద్దకు వచ్చి తమ సొంత గ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్ఐ సురేష్ తెలిపారు.






