- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిలకడగా అచ్చెన్నాయుడి ఆరోగ్యం : జీజీహెచ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా ఇటీవలే జరిగిన పైల్ ఆపరేషన్ గాయానికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించారు. గాయం, బీపీ మినహా ఆయనకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేవని స్పష్టం చేశారు. పచ్చిగా మారిన గాయం ఆయనను మరింత ఇబ్బంది పెడితే మరోసారి ఆపరేషన్ చేసేందుకు వెనుకాడమని చెప్పారు. మూడు రోజుల్లో ఆ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా ఇటీవలే జరిగిన పైల్ ఆపరేషన్ గాయానికి ఇన్ఫెక్షన్ సోకిందని వెల్లడించారు. గాయం, బీపీ మినహా ఆయనకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేవని స్పష్టం చేశారు. పచ్చిగా మారిన గాయం ఆయనను మరింత ఇబ్బంది పెడితే మరోసారి ఆపరేషన్ చేసేందుకు వెనుకాడమని చెప్పారు. మూడు రోజుల్లో ఆ గాయం తగ్గే అవకాశముందని వెల్లడించారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని వివరించారు.
కాగా, అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తరలించే క్రమంలో 20 గంటల పాటు వాహనంలో కూర్చోబెట్టారు.
Next Story






