సామాన్యులకి ఇక చుక్కలే

by  |
సామాన్యులకి ఇక చుక్కలే
X

దిశ,వెబ్ డెస్క్ : ఇప్పటికే పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసాయి. అయితే ఇప్పుడు సామాన్యునికి మరో షాక్ తగలనుంది. బల్బులు, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు విపరీతంగా పెరగి చుక్కలు చూపించనున్నాయి. అయితే ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.

కేంద్రం 2021-22 బడ్జెట్ లో కస్టమ్ డ్యూటీ పెంచిన విషయం తెలిసిందే అందువలన ఈ ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరగచ్చు. చాలామంది సమ్మర్ లో ఏసీ, రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అలాంటి వారు ముందు జాగ్రత్త పడి మార్చి 31లోపే కొంటే మంచిది లేకపోతే అదనపు భారం తప్పదు. ఇక టీవీల విషయానికొస్తే ఒక్కోదానిపై 2 నుంచి 3వేల వరకు ధర పెరిగే చాన్సుంది.

ఇప్పుడే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటం, ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని కొనసాగుతుండటం వల్ల ఈ ఏడాది ఏసీల అమ్మకాల్లో అధిక రెండంకెల వృద్ధి నమోదు కావొచ్చని వోల్టాస్‌, దైకిన్‌, ఎల్‌జీ, బ్లూస్టార్‌, శామ్‌సంగ్‌, పానసోనిక్‌, హయర్‌ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచగా, మరికొన్ని 3-8 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి.


Next Story

Most Viewed