యూట్యూబ్ వ్యూస్.. పెంచుకోండి ఇలా!

by  |
యూట్యూబ్ వ్యూస్.. పెంచుకోండి ఇలా!
X

దిశ, ఫీచర్స్ : గ్లోబల్ కమ్యూనికేషన్‌కు వేదికలా ఉపయోగపడుతూనే మార్కెటింగ్ కోసం ‘ది బెస్ట్ ప్లేస్‌’గా నిలిచింది సోషల్ మీడియా. కొన్నేళ్లుగా ఇక్కడ మార్కెటర్స్, కంటెంట్ క్రియేటర్స్ సాధిస్తున్న విజయాలు ఈ ప్లాట్‌ఫామ్స్‌పై పోటీని పెంచాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మోస్ట్ కాంపిటీటివ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ‘యూట్యూబ్’ ఒకటిగా మారింది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌లో ఓ బిగినర్ విజయవంతం కావాలంటే మాత్రం చాలా కష్టం. ఇక కొత్తగా మొదలు పెట్టినవారికైతే.. టార్గెట్ ఆడియన్స్‌ను రీచ్ అయ్యేందుకు చాలా సంవత్సరాలే పడుతుంది. ఈ క్రమంలో YouTube వ్యూస్ కొనడం బిగినర్స్‌కు ఒక తెలివైన పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. చాలా మంది బిగినర్స్‌కు కిక్ స్టార్ట్ లభించనప్పుడు ఇదే రైట్ సొల్యూషన్ కాగా, అసలు యూట్యూబ్ వ్యూస్ కొనడం వల్ల లాభాలేంటో టెక్ నిపుణులు వివరించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రస్తుతానికి అత్యంత ప్రభావవంతమైన, జనాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ ఒకటి. ప్రతీరోజు యూజర్లు మిలియన్ సంఖ్యలో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుండగా, గూగుల్ తర్వాత అత్యధికంగా ఉపయోగించిన రెండో సెర్చ్ ఇంజిన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే చాలా మంది యూట్యూబ్ యూజర్లు తమ సొంత చానెళ్లలో డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే అవి ఎక్కువ మందిని రీచ్ కాలేకపోతే ఆశించిన ఫలితం దక్కదు. ఇక వీడియోలపై ఇన్‌కమ్ పొందడం పూర్తిగా వ్యూస్ పైనే ఆధారపడి ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఎంత పెరిగితే.. అంతగా నేమ్, ఫేమ్‌తో పాటు మనీ ఎర్న్ చేయొచ్చు.

సోషల్ ప్రూఫ్ :

సామాజిక ప్రూఫ్ (మీ గురించి, మీ కంపెనీ లేదా ఉత్పత్తి గురించి సానుకూల వ్యాఖ్యలు. ఈ వ్యక్తి లేదా ఉత్పత్తి నమ్మదగినదని చెప్పే మరొక ఆమోదం) లేదా ‘బాండ్‌వాగన్ ఎఫెక్ట్’( పాపులర్ అండ్ అట్రాక్టింగ్ ఇంక్రీసింగ్ సపోర్ట్) అంశాలు యూజర్‌ను సైకలాజికల్‌గా ప్రభావం చేస్తాయి. ఇది ఇతరుల ఆమోదానికి ప్రాధాన్యతనిచ్చే మానవ ధోరణిని వివరిస్తుంది. సమాజం లేదా నెటిజన్లు ఏం ఇష్టపడుతున్నారో, ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో.. దాని ఆధారంగానే అందుకు తగ్గ సమాచారాన్ని, విషయాన్ని చెప్పేందుకు ఇష్టపడతాం. యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ లేదా వ్యూస్ ఉన్న అకౌంట్స్, వీడియోలు ‘సోషల్ ప్రూఫ్’‌నకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇతరులు ఎక్కువగా ఇష్టపడ్డ కంటెంట్‌‌ పట్ల వినియోగదారులు తమకు తెలియకుండానే ఆకర్షణకు గురవుతారు. అందువల్లే బిగినర్స్ గుర్తింపు పొందడం చాలా కష్టం, ఎందుకంటే వారి కంటెంట్‌కు సోషల్ ప్రూఫ్ తక్కువ, పైగా ట్రాఫిక్ కూడా ఉండదు. ఈ కారణంగానే వినియోగదారులు వ్యూస్ కొనుగోలు చేయడం ద్వారా వారి YouTube వీక్షణలను పెంచుకోగలిగితే, వారి కంటెంట్‌కు సోషల్ ప్రూఫ్ ఉండటంతో పాటు ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారు.

సక్సెస్ :

యూట్యూబ్‌లోని బిగినర్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి చాలా కాలం వేచి ఉండాలి. అలా కాకుండా వ్యూస్ కొనుగోలు చేస్తే, వీడియో వీక్షణలు పెరగడంతో పాటు సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. లార్జ్ వ్యూ కంటెంట్.. కొత్త వినియోగదారులను కూడా ఆకర్షిస్తుంది. మరిన్ని వ్యూస్‌తో ఇతర ప్రముఖ యూట్యూబర్‌లు, ప్రసిద్ధ చానెళ్లతో పోటీ పడే అవకాశం కూడా ఉంటుంది.

మేక్ మనీ :

డబ్బు సంపాదించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలనుకుంటే, గుడ్ వ్యూ కౌంట్ ఉండటం ఉత్తమం. యూట్యూబ్ వీడియోల ‘మోనటైజేషన్’ అనేది డబ్బు సంపాదించడానికి చాలా ప్రభావవంతమైన వ్యూహం. కానీ దాని కోసం మీరు గుడ్ వ్యూతో పాటు సబ్‌స్క్రైబర్ కౌంట్‌తో వినియోగదారులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు బిగినర్స్ యూట్యూబ్ వ్యూస్ కొనుక్కోవడం వల్ల షార్ట్ పీరియడ్‌లోనే ట్రాఫిక్ పెరిగి, యాడ్ అగ్రిమెంట్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. కాగా గూగుల్ యాడ్‌సెన్స్ అప్రూవల్ పొందడానికి, యూట్యూబ్‌లో వ్యాపార మార్కెటింగ్ ప్రాధాన్యత జాబితాలోకి రావడానికి కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్స్, 4000 గంటల మోనిటోరింగ్ టైమ్ చూసి ఉండాలి. ఒకవేళ యూట్యూబ్ వీక్షణలను కొనుగోలు చేస్తే చానెల్ ద్వారా చాలా వేగంగా డబ్బులు సంపాదించొచ్చు.

సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజీ (ఎస్ఈఆర్‌పీ) :

ప్రతీరోజు నెటిజన్లు తమకు కావాల్సిన టాపిక్స్, క్వెరీస్‌తో సెర్చ్ చేస్తుంటారు. అయితే నెటిజన్ల ఇష్టాలు, సందేహాలు, వారు తెలుసుకోవాలనుకున్న టాపిక్స్ ఆధారంగా అల్గారిథమ్.. కంటెంట్‌ను సిఫార్స్ చేస్తుంది. అల్గారిథం సజెస్ట్ చేసిన కంటెంట్‌ చూసేందుకు వినియోగదారులు 70% కంటే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారని పరిశోధన రుజువు చేసింది. ఈ మేరకు అల్గారిథం ద్వారా మీ కంటెంట్‌ను ఎంచుకోవడం వీక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశాన్ని పెంచుతుంది. అయితే మంచి SERP ర్యాంకింగ్ పొందడానికి, గుడ్ వ్యూ కౌంట్ కలిగి ఉండటం చాలా అవసరం. వ్యూస్ కొనుగోలు చేయడం ద్వారా ‘గుడ్ వ్యూ కౌంట్’ సాధించవచ్చు, దాంతో మనం అందించే వీడియోను అల్గారిథం ఎంచుకునే అవకాశాలను పెంచుకోవచ్చు. అందువల్ల, యూట్యూబ్ వంటి మోస్ట్ కాంపిటీటివ్ వేదికపై గుర్తింపు పొందాలంటే వ్యూస్ కొనడమే తెలివైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed