- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆలన’ వాహనాల ప్రారంభం : వేముల
<p>దిశ , నిజామాబాద్: అసంక్రమిత వ్యాధుల జిల్లా ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల చెంతకు వైద్యాన్ని తీసుకెళ్లే కార్యక్రమం ‘ ఆలన’ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌజ్ వద్ధ ఆలన వాహనాలను జెండా ఉపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసంక్రమిత వ్యాధిగ్రస్థులను గుర్తించి వారి ఇంటి వద్ధకు వెళ్లి వైద్యుడు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు చికిత్స అందిస్తారని […]</p>

దిశ , నిజామాబాద్: అసంక్రమిత వ్యాధుల జిల్లా ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల చెంతకు వైద్యాన్ని తీసుకెళ్లే కార్యక్రమం ‘ ఆలన’ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌజ్ వద్ధ ఆలన వాహనాలను జెండా ఉపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసంక్రమిత వ్యాధిగ్రస్థులను గుర్తించి వారి ఇంటి వద్ధకు వెళ్లి వైద్యుడు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు చికిత్స అందిస్తారని తెలిపారు. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలోని కమ్మర్ పల్లి, చౌట్‌పల్లి, వేల్పూర్, కిసాన్ నగర్, మెండోరా, మోర్తాడ్ మండలాల్లో ఈ ఆలన సేవలను ప్రారంభించినట్లు వివరించారు. ప్రజలకు చికిత్స అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని మంత్రి వైద్యులకు సూచించారు.కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, ప్రోగ్రాం ఆఫీసర్ డా. శంభు తదితరులు పాల్గొన్నారు.






