నడిరోడ్డుపై యువకుడిని పొడిచి చంపిన యువతి

136

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి కొవ్వూరు మండలంలోని కాపవరం- ధర్మవరం రోడ్డుపై యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపింది. మృతుడిని తాడేపల్లిగూడెం వాసిగా స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకొని మలకపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.