ఆ పనికి ఒప్పకోమన్న తల్లిదండ్రులు.. ఇష్టంలేక యువకుడు పురుషాంగాన్ని కోసుకుని..

by  |
chennai crime news
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత యువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి కుటుంబాలకు ఆవేదనను మిగులుస్తోంది. చిన్న చిన్న కారణాలకే వారు ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు అయితే ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.. లేదా ఎదుటి వారి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా ఒక యువకుడి దారుణ నిర్ణయం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. తన మనసులోని బాధను తల్లిదండ్రులు అర్ధం చేసుకోవడంలేదని క్షణికావేశంలో ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారన్న కోపంతో తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు సేలం జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

చెన్నైలోని గాంధీ నగర్ కు చెందిన మురుగన్ కుమారుడు విజయరాఘవన్ కి 23 ఏళ్లు. దీంతో మురుగన్ కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. అదే విషయాన్ని విజయ్ కి తెలిపారు. తనకి అప్పుడే పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదని, తనకు పెళ్లి వద్దని విజయ్ గొడవకు దిగాడు. కొడుకు మనసు అర్ధం చేసుకొని తల్లిదండ్రులు బలవంతంగా విజయ్ కి పెళ్లి నిశ్చయించారు. ఒక వారంరోజుల్లో నిశ్చితార్ధం కూడా ఏర్పాటు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఎవ్వరూ ఊహించని పని చేశాడు.

మగవాడిగా ఉంటేనే తనకు పెళ్లి చేస్తారు.. అదే లేకపోతే అని.. తన ఇంట్లో ఉండే కొడవలితో తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని గొంతుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తను ఇక పెళ్లికి పనికిరానంటూ కేకలేశాడు. గదిలో అరుపులు విన్న తల్లిదండ్రులు హుటాహుటిన అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed