బెజవాడలో ఉన్మాది ఘాతుకం

by  |

దిశ, ఏపీ బ్యూరో: బెజవాడ నగరంలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఇంజనీరింగ్‌ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. క్రీస్తురాజపురం ప్రాంతానికి దివ్య తేజస్విని బెజవాడలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అక్కడే పెయింటర్‌గా పని చేస్తున్న నాగేంద్రబాబు అలియాస్‌ స్వామి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెపై కక్ష గట్టి, నాలుగు రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్వామి కత్తితో దివ్య తేజస్వినిపై దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. దాడి చేసిన అనంతరం స్వామి తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story