- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగ్నంగా బైక్ నడుపుతూ రోడ్డుపై హల్‌చల్ చేసిన యువకుడు
<p>దిశ, హైదరాబాద్ కంటోన్మెంట్: తిరుమలగిరి పీఎస్ పరిధిలోని ఆర్మీ ప్రాంతంలో ఈ.ఎం.ఈ వద్ద ఓ యువకుడు బైక్‌పై నగ్నంగా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత రెండు రోజుల క్రితం యువకుడు మారేడిపల్లి నుండి నేరేడ్మెట్ వైపుగా నగ్నంగా వాహనం నడపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యువకుడు నగ్నంగా ఎందుకు వెళ్తున్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడి వాహనం ఆధారంగా అతనికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బహిరంగ […]</p>

X
దిశ, హైదరాబాద్ కంటోన్మెంట్: తిరుమలగిరి పీఎస్ పరిధిలోని ఆర్మీ ప్రాంతంలో ఈ.ఎం.ఈ వద్ద ఓ యువకుడు బైక్‌పై నగ్నంగా వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత రెండు రోజుల క్రితం యువకుడు మారేడిపల్లి నుండి నేరేడ్మెట్ వైపుగా నగ్నంగా వాహనం నడపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యువకుడు నగ్నంగా ఎందుకు వెళ్తున్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యువకుడి వాహనం ఆధారంగా అతనికి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
బహిరంగ ప్రదేశాలలో బైక్‌పై నగ్నంగా వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను అలా వెళ్లడానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని, యువకుడికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






