- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం సీసాతో తలపై కొట్టి.. ఆ తరువాత.. (వీడియో)
<p>దిశ, నేరేడుచర్ల: మద్యం మత్తులో ఓ యువకుడు ఒక వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేయగా ఆ వ్యక్తికి తీవ్రంగా గాయలైన సంఘటన మఠంపల్లి మండలంలోని రఘునాధపాలెం గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్థులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం గ్రామంలోని గుండ్లపల్లి రోడ్డులో ఉన్న చిన్నపాటి రెస్టారెంట్‌లో అదే గ్రామానికి చెందిన గార్లపాటి సైదా, గంజి సాయిలు వేర్వేరుగా మద్యం తాగేందుకు వెళ్లారు. ఇద్దరు రెండు వేర్వేరు టేబుల్ మీద కూర్చొని మద్యం […]</p>

దిశ, నేరేడుచర్ల: మద్యం మత్తులో ఓ యువకుడు ఒక వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేయగా ఆ వ్యక్తికి తీవ్రంగా గాయలైన సంఘటన మఠంపల్లి మండలంలోని రఘునాధపాలెం గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్థులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం గ్రామంలోని గుండ్లపల్లి రోడ్డులో ఉన్న చిన్నపాటి రెస్టారెంట్‌లో అదే గ్రామానికి చెందిన గార్లపాటి సైదా, గంజి సాయిలు వేర్వేరుగా మద్యం తాగేందుకు వెళ్లారు.
ఇద్దరు రెండు వేర్వేరు టేబుల్ మీద కూర్చొని మద్యం తాగుతుండగా, ఒక్కసారిగా సాయి తన దగ్గర ఉన్న మందు సీసాతో పక్క టేబుల్ దగ్గర ఉన్న గార్లపాటి సైదా(38) తలపై కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పగిలిన సీసాతో సైదాపై దాడి చేయగా అతనికి ఆ సీసా గుచ్చుకొని గాయాలతో పాటు తీవ్రంగా రక్తస్రావం జరిగిందని స్థానికులు తెలిపారు. అతడిని వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గంజి సాయి అక్కడినుంచి పరారయ్యారని అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు.
(1) మద్యం సీసాతో తలపై కొట్టి.. ఆ తరువాత.. (వీడియో) – YouTube






