- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉండగా

దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరిలో ఒకరి పరిస్తితి విషమంగా ఉండగా.. మరొకరూ తీవ్రంగా గాయపడ్డారు. తాడ్వాయి మండలం నందివాడ గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి గ్రామానికి చెందిన అనిల్ తన భార్యతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం నందివాడకు వెళ్లారు. వ్యవసాయ పొలంలో పత్తి మందు కొట్టి పని ముగించుకొని తిరిగి తాడ్వాయి వస్తున్న సమయంలో నందివాడ గ్రామానికి చెందిన రవిసాగర్(30) నడుపుతున్న ద్విచక్ర వాహనం అనిల్ ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.
ఈ ప్రమాద తీవ్రతకు రవిసాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనం నడుపుతున్న అనీల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన అనిల్ ను అతని భార్యను వెంటనే 108 అంబులెన్స్ లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతుడు రవిసాగర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది.






