ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు

by  |
attempted murder
X

దిశ, శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ప్రేమ్‌ సింగ్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ యువతి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో భయాందోళన చెందిన ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమై ప్రేమ్‌ సింగ్‌ను చితకబాదారు. అమ్మాయి మెడకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల దాడిలో ప్రేమ్‌ సింగ్ సైతం గాయపడ్డాడు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే గత కొంతకాలం నుంచి ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ప్రేమ్‌ సింగ్ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. యువతి మెడ సహా మూడు చోట్ల కత్తితో గాయపరిచాడని ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు. నిందితుడు డిగ్రీ చదువుతున్నాడని బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నవీన్ రెడ్డి అన్నారు.



Next Story