- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టా చేయలేదని… ప్రాణాలు తీసుకోబోయాడు
<p>దిశ, పాలేరు: తనకున్న ఎకరం భూమిని అధికారులు పట్టా చేయడం లేదని, తీవ్ర మనస్థాపం చెందిన ఓ యువకుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఓ యువకుడు తనకున్న ఎకరం మూడు కుంటల భూమి ఆర్‌ఓఆర్‌లో నమోదు చేసి పట్టా చేయకుండా, ఐదేండ్లుగా అధికారులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం కార్యాలయానికి వచ్చిన బాధితుడు తహసీల్దార్ […]</p>

X
దిశ, పాలేరు: తనకున్న ఎకరం భూమిని అధికారులు పట్టా చేయడం లేదని, తీవ్ర మనస్థాపం చెందిన ఓ యువకుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే…
ఓ యువకుడు తనకున్న ఎకరం మూడు కుంటల భూమి ఆర్‌ఓఆర్‌లో నమోదు చేసి పట్టా చేయకుండా, ఐదేండ్లుగా అధికారులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం కార్యాలయానికి వచ్చిన బాధితుడు తహసీల్దార్ కార్యాలయంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






