టీ పొడి అనుకోని టీ పెట్టింది.. కానీ తీరా చూస్తే శవమైంది

by Batti.Sumithra |   (  Updated:2021-03-31 01:39:51  IST  )

<p>దిశ, జనగామ: ఉదయం లేవగానే టీ తాగకపోతే కొంతమందికి రోజు మొదలవ్వదు. అలాగే ఇంట్లో మహిళలు సైతం నిద్ర లేచి లేవగానే వంటింట్లోకి వెళ్లి టీ పెట్టేస్తారు. తాజాగా ఒక మహిళ టీ పెట్టేటప్పుడు టీ పొడి అనుకోని విషపు గుళికలు కలిపిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామంలో అంజమ్మ అనే మహిళ ఉదయం ఇంట్లో అందరికి టీ పెడుతుంది. పొరపాటున ఆ టీ లో టీపొడి [&hellip;]</p>

టీ పొడి అనుకోని టీ పెట్టింది.. కానీ తీరా చూస్తే శవమైంది
X

దిశ, జనగామ: ఉదయం లేవగానే టీ తాగకపోతే కొంతమందికి రోజు మొదలవ్వదు. అలాగే ఇంట్లో మహిళలు సైతం నిద్ర లేచి లేవగానే వంటింట్లోకి వెళ్లి టీ పెట్టేస్తారు. తాజాగా ఒక మహిళ టీ పెట్టేటప్పుడు టీ పొడి అనుకోని విషపు గుళికలు కలిపిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామంలో అంజమ్మ అనే మహిళ ఉదయం ఇంట్లో అందరికి టీ పెడుతుంది. పొరపాటున ఆ టీ లో టీపొడి అని భావించిన అంజమ్మ ఎండ్రిన్ గుళికలను కలిపేసింది. అది తెలియకుండా కుటుంబంలోని అందరు ఆ టీ తాగేశారు. ఈ ఘటనలో అంజమ్మ అక్కడిక్కడే మృతిచెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story