- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లో ఉరేసుకున్న వివాహిత.. కారణం అదే అంటున్న బంధువులు
<p>దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ళగోమ్మూరు పరిధిలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలలోకి వెళితే గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్యాన్సర్ వ్యాధి పీడించడం వల్లే అరుణ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. స్థానికుల సమాచారం అందుకున్న మండల ఎస్ఐ జితేందర్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని […]</p>

X
దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ళగోమ్మూరు పరిధిలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలలోకి వెళితే గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్యాన్సర్ వ్యాధి పీడించడం వల్లే అరుణ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. స్థానికుల సమాచారం అందుకున్న మండల ఎస్ఐ జితేందర్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






