భర్త చనిపోయిన రెండు నెలలకే..

by Batti.Sumithra |   (  Updated:2021-02-17 04:36:30  IST  )

<p>దిశ, కామారెడ్డి: భర్త చనిపోయిన రెండు నెలలకే తన కూతురితో సహా ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి పోశి లక్ష్మి(26) తన ఏడాదిన్నర పాప సాత్వికను తీసుకుని గ్రామంలో గల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గత రెండు నెలల క్రితం భర్త చాకలి పోషి స్వామి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ [&hellip;]</p>

భర్త చనిపోయిన రెండు నెలలకే..
X

దిశ, కామారెడ్డి: భర్త చనిపోయిన రెండు నెలలకే తన కూతురితో సహా ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి పోశి లక్ష్మి(26) తన ఏడాదిన్నర పాప సాత్వికను తీసుకుని గ్రామంలో గల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గత రెండు నెలల క్రితం భర్త చాకలి పోషి స్వామి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో లక్ష్మి తన కూతురితో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మంగళవారం నుంచి తల్లి లక్ష్మి, కూతురు సాత్విక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. అయితే చెరువు వద్ద ఆధార్ కార్డు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి చెరువులో వెతికారు. బుధవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు చెరువులో తేలాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story