మానవులతో దూసుకెళ్లిన ‘హైపర్‌లూప్’

by  |
మానవులతో దూసుకెళ్లిన ‘హైపర్‌లూప్’
X

దిశ, వెబ్‌డెస్క్ : విమాన వేగం.. భూమ్మీద సాధ్యమవుతుందా? అంటే దానికి సమాధానమే ‘హైపర్ లూప్’. వర్జిన్ హైపర్ లూప్ అనే సంస్థ ఈ ప్రయోగాన్ని మనుషులతో నిర్వహించి విజయం సాధించింది. ఇందులో భాగంగా జోష్ జిగెల్, శారా లుచియాన్‌ ఇందులో ప్రయాణించారు.

అమెరికాలోని నెవాడా ఎడారిలో నిర్వహించిన హైపర్ లూప్ ప్రయోగంలో అరకిలోమీటర్‌ దూరాన్ని కేవలం 15 సెకన్లలోనే ప్రయాణించిన హైపర్ లూప్.. గంటకు 172 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోవడం విశేషం. మెట్రో రైలు తరహాలోనే ప్రయాణించే హైపర్ లూప్‌లో బోగీలకు బదులుగా పాడ్‌లు లేదా క్యాప్యూల్స్ ఉంటాయి. మెట్రోలో ఉన్నట్టుగా పిల్లర్లు ఏర్పాటు చేస్తారు. మ్యాగ్నటిక్‌ లెవిటేషన్‌ పద్ధతిలో ఇది ముందుకు సాగుతుంది. కాగా హైపర్ లూప్ వ్యవస్థలను స్తంభాలపై కానీ, భూగర్భంలో కానీ ఏర్పాటు చేయొచ్చు. ఈ ప్రయోగాలు ముందు ముందు కూడా జరుగుతాయని, తర్వాతి ప్రయోగంలో భారత సంతతి వ్యక్తి తనయ్‌ మంజ్రేకర్‌ పాల్గొననున్నారని సంస్థ తెలిపింది. పుణె, పంజాబ్‌ రాష్ట్రాల్లో వర్జిన్‌ హైపర్‌లూప్‌ ప్రాజెక్టులు చేపట్టనుంది. కాగా మానవులను పంపించి ఈ తరహా ప్రయోగం చేసిన మొట్టమొదటి సంస్థ వర్జిన్ హైపర్ లూప్ కావడం విశేషం.

Next Story