పోలీసును బలితీసుకున్న ఐపీఎల్

by  |
పోలీసును బలితీసుకున్న ఐపీఎల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 13 అందరింట్లో సందడి నింపితే ఓ పోలీసు ఇంట్లో విషాదాన్ని నింపింది. తనకిష్టమైన జట్లు తలపడుతున్నాయని.. బిల్డింగ్‌ పైకి ఎక్కి మ్యాచ్‌ వీక్షిస్తున్న అతడు ఒక్కసారిగా కిందకి పడిపోయాడు. రూఫ్ పై నుంచి కిందపడి తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

ఈ విషాద ఘటన ఒడిశా లోని రాయగడ జిల్లాలో చండిలి ఏరియాలో చోటుచేసుకుంది. నబారంగ్పూర్ జిల్లాకు చెందిన యోగేశ్వర్ (27) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీసు విధుల్లో భాగంగా చండిలిలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు.

అయితే, విధులు ముగించుకొని క్వార్టర్స్‌కు వచ్చిన యోగేశ్వర్ ఐపీఎల్ టైమ్ కావడంతో మంగళవారం బిల్డింగ్ పైకి ఎక్కాడు. పిట్టగోడ వద్ద నిలబడి మ్యాచ్ చూస్తున్న యోగేశ్వర్ అదుపు తప్పి బిల్డింగ్ మీద నుంచి కిందకి పడిపోయాడు. తీవ్రగాయాల పలు అయిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే మృతి చెందినట్టు డాక్టర్లు తెలుపడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story

Most Viewed