హాయ్ ఫ్రెండ్స్…ఐ మిస్ యూ..

by  |
హాయ్ ఫ్రెండ్స్…ఐ మిస్ యూ..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశాడు. హాయ్ ఫ్రెండ్స్… ఐ మిస్ యూ… నేను చనిపోతున్నా..! అని మిత్రులకు వీడియో సందేశం పంపాడు. స్టేటస్ లోనూ పెట్టుకున్నాడు. అది గమనించిన మిత్రులు పరుగున అతని ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ యువకుడు మరణించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది.

కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం…బైంసా మండలంలోని సుoక్లి గ్రామానికి చెందిన జాజుల వార్ రాజు ఓ ప్రైవేట్ దుకాణంలో పని చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి అతను కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కడుపు నొప్పి మంగళవారం ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ పూర్ణ చందర్ తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాజు సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు పోస్టు చేసి మరీ ప్రాణాలు తీసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.


Next Story

Most Viewed