‘వకీల్ సాబ్’పై పీఎస్‌లో కంప్లయింట్ చేసిన పోలీస్.. 

by  |
‘వకీల్ సాబ్’పై పీఎస్‌లో కంప్లయింట్ చేసిన పోలీస్.. 
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ క్రిటిక్స్ అప్లాజ్ అందుకుంది. ‘పింక్’ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా పాండమిక్‌లోనూ బాక్సాఫీస్ రికార్డ్‌లు బ్రేక్ చేయగా ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్యల నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుండగా.. సుధాకర్ అనే వ్యక్తి ‘వకీల్‌ సాబ్’ మేకర్స్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. అనుమతి లేకుండా మూవీలో తన ఫోన్ నంబర్‌ను యూజ్ చేయడం వల్ల స్పామ్ కాల్స్ వస్తున్నాయని తెలిపాడు. చాలా మంది ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా సుధాకర్ తరపు న్యాయవాది సినిమా నిర్మాతలైన దిల్ రాజు, బోనీకపూర్‌లకు నోటీసులు పంపించాడని.. వారి నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉందని తెలిపారు పోలీసులు.



Next Story

Most Viewed