అత్తింటి వేదింపులకు వివాహిత మృతి..

by Batti.Sumithra |

<p>దిశ, పటాన్‌చెరు: అత్తింటి వేధింపులు తాళలేక పెళ్ళైన పది నెలలకే ఓ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య యత్నం చేసి, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసింపురం గ్రామం, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లాకు చెందిన అంబిక (25)ను మండలంలోని పెద్దకంజర్ల గ్రామానికి చెందిన బుడిగి రాజారెడ్డి తో 10 నెలల క్రితమే వివాహమైంది. వివాహమైన కొద్ది రోజుల వరకు వారి సంసారం సాఫీగానే సాగింది. కొన్నాళ్ల నుంచి అంబిక [&hellip;]</p>

mother killed daughter
X

దిశ, పటాన్‌చెరు: అత్తింటి వేధింపులు తాళలేక పెళ్ళైన పది నెలలకే ఓ ఇల్లాలు ఉరేసుకుని ఆత్మహత్య యత్నం చేసి, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసింపురం గ్రామం, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లాకు చెందిన అంబిక (25)ను మండలంలోని పెద్దకంజర్ల గ్రామానికి చెందిన బుడిగి రాజారెడ్డి తో 10 నెలల క్రితమే వివాహమైంది. వివాహమైన కొద్ది రోజుల వరకు వారి సంసారం సాఫీగానే సాగింది. కొన్నాళ్ల నుంచి అంబిక ను భర్త రాజారెడ్డి, అత్త యాదమ్మలు అదనపు వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ నెల 25న సాయంత్రం 6 గంటల సమయంలో భర్త రాజారెడ్డి, అత్త యాదమ్మ లు అదనపు కట్నం కోసం శారీరకంగా హింసించడంతో అంబిక జీవితంపై విరక్తి చెంది ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.

కొన ఊపిరితో ఉన్న అంబికను పటాన్‌చెరు పట్టణంలోని మాక్స్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. భయంతో వారి అత్తమ్మ చీరతో ఆత్మహత్యకు పాల్పడింది. అంబిక చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో మృతి చెందగా, అత్త యాదమ్మ పరిస్థితి విషమంగా ఉంది. పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి లు ఆస్పత్రికి వెళ్లి మృతురాలి పూర్వాపరాలను పరిశీలించారు. తహశీల్దార్ మహిపాల్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. అత్తింటి వేధింపులు తాళలేకనే బలవన్మరణం చేసుకుందని మృతురాలి సోదరుడు చంద్రకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story