- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మా నేను చేసిన తప్పేంటి ?
by Batti.Sumithra |
<p>దిశ-గోషామహల్ : తల్లి అంటే నవమాసాలు మోసి కని పెంచి బిడ్డ ఆలనా పాలనా చూసుకునేది, బిడ్డకు జబ్బు చేసింది అని తెలిస్తే ఎన్ని నోములు నోచడానికి అయినా, ఇంకా ఎన్నో ఉపవాసాలు చేయడానికి అయినా వెనకాడదు.. అయితే ఇలాంటి మాతృమూర్తులు ఉన్న భూమ్మీద కర్కష మనస్తత్వం ఉన్న తల్లులూ ఉంటారని కొన్ని సంగటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంగటనే యావత్ పురా లో జరిగింది. నవమాసాలు.. మోసిన ఓ కన్న తల్లి ఆడ బిడ్డ పుట్టిందనే […]</p>

X
దిశ-గోషామహల్ : తల్లి అంటే నవమాసాలు మోసి కని పెంచి బిడ్డ ఆలనా పాలనా చూసుకునేది, బిడ్డకు జబ్బు చేసింది అని తెలిస్తే ఎన్ని నోములు నోచడానికి అయినా, ఇంకా ఎన్నో ఉపవాసాలు చేయడానికి అయినా వెనకాడదు.. అయితే ఇలాంటి మాతృమూర్తులు ఉన్న భూమ్మీద కర్కష మనస్తత్వం ఉన్న తల్లులూ ఉంటారని కొన్ని సంగటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంగటనే యావత్ పురా లో జరిగింది. నవమాసాలు.. మోసిన ఓ కన్న తల్లి ఆడ బిడ్డ పుట్టిందనే నెపంతో మాతృత్వాన్ని మరచి యావత్ పురాలోని బ్రాహ్మణ వాడిలోని టిన్ షెడ్ దుకాణం వద్ద వదిలి వెళ్ళి పోయింది. కాగా శిశువు ఏడుపు విన్న స్థానికులు రేయిన్ బజార్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును వైద్య చికిత్సల నిమిత్తం నీలోఫర్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్యంగా ఉందని దవాఖాన వైద్యులు తెలిపారు.
Next Story






