మోడల్‌పై సైకో మర్డర్ స్కెచ్.. లీకైన ప్లాన్

by  |
Model Kendall Jenner
X

దిశ, సినిమా : సూపర్ మోడల్ కెండర్ జెన్నర్‌.. తనను చంపేందుకు ఓ యువకుడు అమెరికాలో తిరుగుతున్నాడన్న పోలీసుల సమాచారంతో కోర్టును ఆశ్రయించింది. మాలిక్ బౌకర్ అనే 24 ఏళ్ల యువకుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరింది. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ డిటెక్టివ్ ఒకరు ఈ విషయాన్ని తనకు చెప్పారని కోర్టుకు వివరించింది.

మాలిక్ అనే వ్యక్తి తనను చంపేందుకు ఇల్లీగల్‌గా గన్ కొనుగోలు చేసేందుకు ట్రై చేస్తున్నాడని లీగల్ డాక్యుమెంట్స్‌లో పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం ఈ సైకో లోకల్ హాస్పిటల్‌లోని సైకియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడని, త్వరలో బయటకు రావచ్చని పోలీసులు తనను హెచ్చరించినట్లు తెలిపింది. ఈ ఇన్సిడెంట్ తనకు మెంటల్‌ స్ట్రెస్ కలిగిస్తోందని, అసలు ఆ వ్యక్తిని తాను ఇప్పటి వరకు కలిసిందే లేదని వెల్లడించింది. కాగా ఎక్స్‌పెన్సివ్ ప్రాపర్టీ కలిగి ఉన్న కెండల్ అభ్యర్థన మేరకు జడ్జ్ సానుకూలంగా స్పందించారు. తనకు 24 గంటల ప్రొటెక్షన్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కెండల్ ఇంటి దగ్గర ఇప్పటికే భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు.. 24 గంటల పాటు నిఘా పెట్టారు.

Next Story

Most Viewed