- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైతన్యపురి ఫ్రూట్ మార్కెట్‌లో దారుణ హత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ఫ్రూట్ మార్కెట్‌లో దారుణ హత్య జరిగింది. శనివారం తెల్లవారుజామున రాజు అనే పాత నేరస్థుడిని ఫిరోజ్ అనే వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో పండ్ల దొంగతనం కేసులో రాజు అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో రాజు శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఫ్రూట్ మార్కెట్‌లో పనిచేసే మరో కూలి మహ్మద్ ఫిరోజ్‌తో గొడవపడ్డాడు. తననే అరెస్టు చేయిస్తావా.. అంతు చూస్తానని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ఫ్రూట్ మార్కెట్‌లో దారుణ హత్య జరిగింది. శనివారం తెల్లవారుజామున రాజు అనే పాత నేరస్థుడిని ఫిరోజ్ అనే వ్యక్తి గొంతు కోసి చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో పండ్ల దొంగతనం కేసులో రాజు అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో రాజు శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఫ్రూట్ మార్కెట్‌లో పనిచేసే మరో కూలి మహ్మద్ ఫిరోజ్‌తో గొడవపడ్డాడు. తననే అరెస్టు చేయిస్తావా.. అంతు చూస్తానని రాజు బెదిరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఫిరోజ్ తెల్లవారుజామున రాజు గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రాజును హత్య చేసిన ఫిరోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






